telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ప్రయాణికులకు షాకిచ్చిన విమాన కంపెనీలు…

airplane

అసలే కష్టాల్లో ఉన్న ఎయిర్‌లైన్స్ సంస్థలు లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ బాధను భరించలేక విమాన కంపెనీలు ప్రయాణికులను ‘ప్రియమైన వినియోగదారులారా మీరు కొన్న టికెట్లకు నో రీఫండ్’ అని హెచ్చరిస్తున్నాయి. ఈ నెల 14న లాక్‌డౌన్ ఎత్తేసారని లక్షల సంఖ్యలో ప్రయాణికులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే మోదీ మూసివేతను మే 3వరకూ పొడిగించడంతో అన్ని సర్వీసులు రద్దయ్యాయి. రైల్వే టికెట్ల మాదిరే తమకూ రిఫండ్ చేస్తారని విమాన ప్రయాణికులు ఆశిస్తున్నారు. కానీ ఎయిర్ లైన్స్ సంస్థలు నీళ్లు చల్లుతున్నాయి. అలాంటి రిఫండ్స్ ఏమీ ఉండవని పలు కంపెనీలు స్పష్టం చేశాయి. ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకూ బుకింగ్‌లను రద్దు చేశామని, ఆ టికెట్లకు రిఫండ్ ఉండవని వెల్లడించాయి. టికెట్లు తీసుకున్న వారు మాత్రం.. లాక్‌డౌన్ తర్వాత వాటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నాయి. అవి ఈ ఏడాది చివరవరకూ చెల్లుబాటు అవుతాయని పేర్కొంటున్నాయి.

Related posts