telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హుజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారు

రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీలో అంకితభావంతో ధీక్షతో పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా పనిచేసిన గెల్లుశ్రీనివాస్ యాదవ్ ఉద్యమ కాలంలో అరెస్టులయ్యి పలుమార్లు జైలుకెల్లారు.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను పోటీలో దింపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాతో కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే.

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ ఈ ఉప ఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తోన్న ప్రభుత్తం.. తమ పార్టీ అభ్యర్థి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేసి చివరకు గెల్లు శ్రీనివాస్‌ వైపు మొగ్గు చూపింది.

Related posts