నాకు అమ్మంటే దేవుడితో సమానమని ప్రముఖ హీరో మహేశ్ బాబు అన్నారు. ‘మహర్షి’ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ ఈరోజు చాలా స్పెషల్ డే, ‘మదర్స్ డే’ అని అన్నారు.ఎంతో గొప్ప బ్లాక్ బస్టర్ అయిన ‘మహర్షి’ చిత్రాన్ని తల్లులందరికీ అంకితం చేస్తున్నట్టు మహేశ్ తెలిపారు.
తన సినిమా రిలీజ్ కు ముందు తన తల్లి ఇచ్చే కాఫీ తాగుతానని, ఆ కాఫీ తాగితే గుడిలో ప్రసాదం తిన్నంత తృప్తిగా ఉంటుందన్నారు. అమ్మ ఆశీస్సులు తనకు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. అందుకే తనకు విజయాలు లభిస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీ ఎన్నికల పై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు