ప్రేమకథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరో సుమంత్ తన తొలి చిత్రంతోనే పరాజయాన్ని చవిచూశాడు. దాని తర్వాత సత్యం సినిమాతో హిట్ అందుకున్నాడు. తరువాత వచ్చిన మహానంది సినిమా అంతఅంత మాత్రంగానే నిలిచింది. దాందో 2006లో తన ట్రాక్ మార్చిన సుమంత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రొమాంటిక్ మూవీ గోదావరీ తెరకెక్కించాడు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్న సుమంత్ తన తదుపరి చిత్రం చిన్నోడుతో మళ్లీ యావరేజ్ హీరోగా నిలిచాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినప్పటికి అవిఆశించిన విధంగా ఫలితాలు రాలేదు. దాంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న సుమంత్ గోల్కొండ హైస్కూల్ సినిమాతో రీఎంట్రీ ఎచ్చాడు. ఈ సినిమా ఇంగ్లీష్ నవల ఆధారంగా తెరకెక్కింది. ఇది పర్వాలేదు అన్నా టాక్‌తో నిలిచింది. అయితే తాజాగా సుమంత్ ఓ థ్రిల్లర్ డ్రామాలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘కపటధారి’ అనే పేరు ఫిక్స్ చేశాడు. ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా సుమంత్ కనిపించాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ నేడు విడుదలైంది. దీనిని స్టార్ హీరోయిన్ సమంత విడుదల చేసింది. ట్రైలర్‌ని బట్టి చూస్తే చాలా కాలం క్రితం మూతబడిన కేసు నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కింది. దీనికి హేమంత రావు గారు కథను అందించారు. ఈ చిత్రాన్ని జీ ధనంజయన్ నిర్మించారు. ఈ సినిమా కన్నడ ‘కవలుదారి’ సినిమాకు రీమేక్‌గా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ అవుతోంది. ఈ ట్రైలర్ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాతో సుమంత్ మళ్లీ హిట్ ట్రాక్‌లో వస్తాడని ఆశిస్తున్నారు. ఇందులో నాజర్, జయప్రకాష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు.
నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు: మంద కృష్ణ