telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పోలవరం పై గవర్నర్ కు కేవీపీ ఫిర్యాదు

KVP comments Polavaram project

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను రాజభవన్ లో కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుపై వినతిపత్రం సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిదేనని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తుంటే అడ్డుకునేందుకు కోర్టుల నుంచి టీడీపీ స్టేలు తెచ్చుకుందని ఆయన బహిరంగ లేఖలో విమర్శించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అటు కేవీపీ లేఖపై ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా కేవీపీ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.

Related posts