telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్..మే 2 న కీలక ప్రకటన !

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతం చేస్తోంది. అటు మన దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.66 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 3,46,786 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 2624 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,19,838 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,66,10,481కాగా.. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 25,52,940 గా ఉన్నాయి. అయితే కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం లాక్ డౌన్ కు మొగ్గు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్రం ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ముందస్తు ఏర్పాట్లు, రాష్ట్రాలతో జరుపుతున్న సంప్రదింపులు.. ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఆక్సిజన్​ సరఫరా కోసం ఆర్మీ
ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి దించిన విషయం తెలిసిందే. కంటోన్మెంట్ ఆసుపత్రులను సాధారణ ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు.

ఆక్సిజన్ సరఫరా కోసం రంగంలోకి ఆర్మీ
దేశంలో ఆక్సిజన్ సరఫరా కోసం ఆర్మీని రంగంలోకి కేంద్రం దించింది. కంటోన్మెంట్ అసుపత్రులను ప్రజల చికిత్స కోసం అనుమతించారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, ఆక్సిజన్, వెంటిలేటర్లు సహా అనేక అంశాలపై వైద్యారోగ్యశాఖను అప్రమత్తం చేశారు.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దేనికి సంకేతం :
దేశంలో ‘ఎమర్జెనీ తరహా’ పరిస్థితులు నెలకొన్నాయని సుప్రీంకోర్టు సైతం వ్యాఖ్యానించింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్రానికి మొట్టికహాలు కూడా వేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా ? లేక మమ్మల్ని తీసుకోమంటారా ? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

మే, జూన్ నెలలో ఉచితంగా ఆహార ధాన్యాలు :
మే, జూన్ నెలలకు తలా ఐదు కిలోల చొప్పున సుమారు 80 కోట్ల మందికి బియ్యం, గోధులను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సమకూర్చనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటన్నింటినీ పరిశీలిస్తే.. మే 2వ తేదీ తర్వాత ఎప్పుడైనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ పరిస్థితులు విషమిస్తే ఈ లోపే అలాంటి నిర్ణయాన్ని ఎంపిక చేసిన రాష్ట్రాలు, నగరాల్లో తీసుకునే అవకాశం ఉంది.

ఓట్ల లెక్కింపు తర్వాత?
ఈ నెల 29న చివరి దశ పోలింగ్ ఉన్నందున మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికాగానే దేశంలోని పరిస్థితులపై కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోతాయని, దినకూలీపై ఆధారపడి బతికేవారి జీవనోపాధి దెబ్బతింటుంటుందని, ఆకలి చావులు పెరుగుతాయనే సందేహాలున్నప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు మరో మార్గం లేదని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది. పరిశ్రమాధిపతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కొన్ని జాగ్రత్తలు చెప్పారు.‘‘రానున్న కొన్ని వారాలు మరింత అప్రమత్తంగా గమనిస్తూ ఉండాలి. దానికి అనుగుణంగా తొలి క్వార్టర్‌కు ఏం చేయాలో నిర్ధిష్ట యాక్షన్ ప్లాన్, సన్నాహక చర్యలను రూపొందించుకోండి’’ అని ట్విట్టర్ ద్వారా సంకేతాలిచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి లాక్ డౌన్ విధించాలని లేకున్నా దేశంలో ప్రస్తుత పరిస్థితులు మాత్రం..దారుణంగా ఉన్నాయి. లాక్ డౌన్ తప్ప మరే మార్గం కనిపించడం లేదు. మే 2 న మోడి ఎలాంటి ప్రకటన చేస్తారో అని అందరిలోనూ ఉత్కంటత నెలకొంది.

Related posts