శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. కోలీవుడ్ మీడియా ప్రకారం మజిలీ చిత్ర రీమేక్ రైట్స్ స్టార్ హీరో ధనుష్ దక్కించుకున్నాడట. త్వరలోనే తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ సంస్థపై ధనుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడని అంటున్నారు. మరి ఇందులో హీరోగా ధనుష్ నటిస్తాడా లేదంటే మరో హీరోతో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ధనుష్ ప్రస్తుతం “అసురన్” అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.
previous post
next post