రెండో విడత లోక్ సభ ఎన్నికలు, ఒక్క తమిళనాడు మినహా, ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో పోలింగ్ సమయం ముగిసింది. తమిళనాడులోని 37 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు, మధురైలో 8 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ సమయం ముగిసింది. రెండో విడత లోక్ సభ ఎన్నికలు 11 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగాయి. ఈ నెల 23న మూడో విడత పోలింగ్ 113 లోక్ సభ స్థానాలకు జరగనుంది.