telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు నెలలకోసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తాము: చంద్రబాబు

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలిసారి నిర్వహించిన కాన్ఫరెన్స్ చారిత్రాత్మక కాన్ఫనెన్స్ అని, ఎప్పటికప్పుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం అందరికి ఉందన్నారు.

గాడి తప్పిన పాలనను సరిదిద్దడానికి అధికారులు, ఉద్యోగులు అంతా ఒకే వేవ్ వేవ్ లెంగ్త్‌ లో పనిచేయడానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు విధిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ సమిష్టిగా ముందుకు వెళ్లేలా నడుస్తున్నట్టు చెప్పారు.

ఐదేళ్లకు ముందు అధికారంలోకి వచ్చినాయన ప్రజావేదికలో కలెక్టర్లకాన్ఫరెన్స్ పెట్టి, కాన్ఫరెన్స్ అయిన వెంటనే దానిని కూల్చేస్తామని చెప్పి, ప్రకటన తర్వాత విధ్వంసానికి శ్రీకారం చుట్టారని అన్నారు.

ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని రంగాల్లో విధ్వంసం తప్పలేదన్నారు. తాను మొదటిసారి సిఎం అయినపుడు అధికారుల్లో నైతిక సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండేది.

అప్పట్లో కొంత అవినీతి సమస్య ఉండేది. ఇప్పుడు విధ్వంసం, అధికారుల్ని బెదిరించి పనిచేయించడం జరిగింది. ఐదేళ్లలలో అధికారుల మనోభావాలను దెబ్బతీసారన్నారు.

ఒకప్పుడు ఆంధ్రా బ్యూరోక్రసి అంటే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేదని, ఇక్కడి నుంచి వెళ్లే వారికి కేంద్రంలో కీలక స్థానాలు దక్కేవన్నారు. ఇప్పుడు ఆంధ్రా అధికారులంటే అన్ టచబుల్స్ అయ్యారని,వీళ్లేమి చేయలేరనే భావన వచ్చిందన్నారు.

రాష్ట్రమంతటా జరిగిన విధ్వంసాన్ని కరెక్ట్ చేయాలంటే అదనపు శ్రమ చేయాలన్నారు.

ఐదేళ్ల క్రితం కట్టుకున్న కాన్ఫరెన్స్ హాల్లోనే మళ్లీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.

ఐదేళ్ల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదంటే పాలన ఎలా జరిగిందో గుర్తు చేసుకోవాలన్నారు.

మూడు నెలల్లో మరో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని చెప్పారు. గంటల తరబడి నిర్వహించనని హామీ ఇచ్చారు. కలెక్టర్లకు పనిచేయకపోతే గ్యారంటీ ఉండదని, ఉపేక్షించే అవకాశమే లేదన్నారు.

సమర్థవంతంగా పనిచేయాలని, కలెక్టర్లు అంతా తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ సమస్యనైనా మానవత ధృక్పథంతో వ్యవహరించాలని, ఆ దిశగా కలెక్టర్లు పనిచేయాలన్నారు.

Related posts