నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు – నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు , బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నా – కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తా – పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు .
నాపై ఎలాంటి కేసులు లేవు – ఏది తప్పో.. ఏది ఒప్పో నాకు తెలుసు – ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదు -రాజ్యాంగపరంగా నా హక్కును ఎందుకు కాలరాస్తున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.ఈ క్రమంలో పోలీసులు-లోకేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ.. ఖాకీలకు వ్యతిరేకంగా కార్యకర్తలు, నేతలు నినాదాలతో హోరెత్తించారు.
కాగా..గత ఫిబ్రవరి 24న ఉన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన ముప్పాళ్ల మండలం గోళ్లపాడుకు చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబసభ్యులను పరామర్శించడానికి గుంటూరు వెళ్లారు. నరసరావుపేట పర్యటన కోసం గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చారు. అయితే.. పర్యటనకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. దీంతో పోలీసుల తీరుపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలి..మాజీ మంత్రి చింతా మోహన్