telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సొంత పార్టీకే .. షాకిస్తున్న సుజనా …ఇప్పటికి అవేమాటలు..

4 directors arrested from sujana chowdary offices

సుజనాచౌదరి టీడీపీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం వల్లనే బాబుకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ తెరచాటున చక్రం తిప్పేవారు. అలా ఆయన చేసిన సేవలు మెచ్చి చంద్రబాబు రాజ్యసభ సీటు రెండు మార్లు కట్టబెట్టారు. మరి బాబు రుణం సుజన తీర్చుకున్నారా అంటే మోడీ క్యాబినెట్లో సహాయ మంత్రిగా ఉంటూ చాలా తీర్చుకున్నారు. బీజేపీలోకి ఫిరాయించిన తరువాత కూడా తమ మాజీ అధినేత మీద ఈగ వాలకుండా చూసుకుంటున్నారు. ఆయన విశాఖ టూర్లో చేసిన కొన్ని కామెంట్స్ పరిశీలిస్తే ఆయన ఇంకా టీడీపీలో ఉన్నారా అన్న డౌట్లు వస్తాయి. సుజనా జగన్ని దారుణంగా విమర్శించారు. ఏపీలో పాలన లేనేలేదని అన్నారు. జగన్ అన్ని విధాలుగా ఫెయిల్ అయ్యారని కూడా పెద్ద మాట వాడారు. అదే సమయంలో పాలన అంటే చంద్రబాబుని టార్గెట్ చేయడం కాదు జగన్ అంటూ సుద్దులు చెప్పారు.

కాంట్రాక్టులు రద్దు చేయడం, రివర్స్ టెండరింగ్ ఇదేం పాలన అంటూ ఎకసెక్కం ఆడారు సుజనా. జగన్ చంద్రబాబుపై కక్షకట్టి పాలన చేస్తున్నారని అన్నారు. ఈ మాటలు విన్నపుడు సుజనా పసుపు తమ్ముడుగా మాట్లాడారని అనిపిస్తుంది. నిజమే ఆయనకు చంద్రబాబు రాజకీయ గురువు. ఆ మాట కూడా ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. అటువంటి సుజనా బాబుకు లాభం చేకూర్చే పని చేస్తారు తప్ప విమర్శలు ఎందుకు చేస్తారు. సుజనా ద్రుష్టిలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాబుకు వ్యతిరేకమన్నమాట. మొన్న ఏపీకి వచ్చినపుడు పోలవరం టెండర్ల రద్దు పై మండిపడింది కూడా ఇదే సుజనా చౌదరి. మెల్లగా ముసుగు తొలగించుకుని చంద్రబాబు భక్తిని చాటుకున్న సుజన తీరు బీజేపీలో నేతలు ఎలా జీర్ణించుకుంటున్నారో అర్ధ కావడంలేదని వైసీపీ నాయకులు సెటైర్లు వేస్తున్నారు.

Related posts