telugu navyamedia
క్రీడలు వార్తలు

అందుకే భువీని టెస్టు జట్టులోకి తీసుకోలేదా…?

బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు భువనేశ్వర్‌ కుమార్‌. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ త్వరలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు భువీని ఎంపిక చేయకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. దీంతో భువీపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం, తరచూ గాయాల పాలవ్వడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదని బోర్డు వర్గాల సమాచారం. రెండేళ్లు అతడు టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం, రంజీల్లోనూ ప్రభావం చూపకపోవడం, దేశవాళీ క్రికెట్లోనూ ఎక్కువగా ఆడకపోవడాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ వంటి దేశాల్లో సుదీర్ఘ కాలం టెస్టు సిరీస్‌ ఆడగలిగే ఫిట్‌నెస్ భువీకి ఉన్నట్టు సెలక్టర్లు భావించడం లేదని సమాచారం. అందుకే టెస్ట్ ఫార్మాట్‌కు అతడిని ఎంపికచేయలేదు. అయితే భువనేశ్వర్‌ కుమార్‌ రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే.

Related posts