నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన పక్షిరాజా స్టూడియోస్ వారి “అగ్గిరాముడు” 05-08-1954 విడుదలయ్యింది.
దర్శక-నిర్మాత యస్.యమ్.శ్రీరాములు నాయుడు పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ: నామక్కల్ రామలింగకవిజ్ఞర్, మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ సంగీతం: ఎస్.ఎం. సుబ్బయ్య నాయుడు, ఫోటోగ్రఫీ:
శైలేన్ బోస్, నృత్యం: తంగరాజు, ఎడిటింగ్: వేలుస్వామి అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, భానుమతి, ఆర్.నాగేశ్వరరావు, రేలంగి, ముక్కామల, ఋష్యేంద్రమణి, మహాంకాళి వెంకయ్య, దొరస్వామి, సురభి బాలసరస్వతి తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు యస్.యమ్. సుబ్బయ్యనాయుడు గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“కొండ కోనల్లోన పండిన దొండాపండా”
“ఎవరురా నీవెవరురా”
“రానీ రాజు రానీ రేయి కానీ రాజు రానీ”
“ఎవరో పిలిచారూ, నాఎదుటేవరో నిలిచారూ'”
వంటి పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ గారు నటించిన 30 వ సినిమా “అగ్గి రాముడు” అంతేకాకుండా “రాముడు” టైటిల్ తో ప్రారంభమైన ఎన్టీఆర్ గారి మొట్ట మొదటి సినిమా ఇదే కావటం విశేషం. ఈ చిత్రం లో తొలిసారిగా ఎన్టీఆర్ గారు “అల్లూరి సీతారామరాజు” గెటప్ లో కనిపిస్తారు.
ప్రఖ్యాత నాజర్ దళం తో అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర పై బుర్రకథ చెప్పుతున్న సన్నివేశంలోఎన్టీఆర్ గారు “అల్లూరి సీతారామరాజు” గా తెర మీద కనిపిస్తారు.
నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో “అగ్గి రాముడు” ( తెలుగు), “మలై కళ్లన్”( తమిళ్) సమాంతరంగా నిర్మించారు.
“అగ్గి రాముడు” లో (05-08-1954) ఎన్టీఆర్ హీరో కాగా, “మలై కళ్ళన్” తమిళ చిత్రంలో ఎం.జి.ఆర్ హీరో
(22-07-1954) నటించటం జరిగింది.
ఎన్టీఆర్,ఎం.జి.ఆర్ ఒకే కథతో ఏక కాలంలో నిర్మింబడిన సినిమా ఇది ఒక్కటే కావటం విశేషం.
తమిళ “మలై కళ్ళన్” సినిమాకు మాటలు రాసిన కరుణానిధి, తెలుగు, తమిళ వెర్షన్ల లలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్, ఎం.జి.ఆర్ లు ఆ పిదప ముఖ్యమంత్రులు కావటం ఈ సినిమా ప్రత్యేకత ఈ సినిమా అవుట్ డోర్ సన్నివేశాలు “హోగనకల్” పరిసరాలలో చిత్రీకరించారు.
ఆ రోజుల్లోనే సుమారు 70 సంవత్సరాల క్రితమే “రోప్ వే” మీద హీరో, హీరోయిన్లు ప్రయాణించే సన్నివేశాలను ఈ సినిమా లో చిత్రీకరించారు.
మంచి కథా బలం, కథనం తోనూ సాగే ఈచిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి విడుదలైన అన్ని కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి,
7 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది. 2 కేంద్రాలలో 175 రోజులు ఆడి (సిల్వర్ జూబ్లీ) జరుపుకున్నది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు :–
1) విజయవాడ – సరస్వతి (120 రోజులు),
2) గుంటూరు — సరస్వతి,
3) రాజమండ్రి – కృష్ణా,
4) కాకినాడ – లక్ష్మి,
5) ఏలూరు – కేసరి,
6) మచిలీపట్నం – సరస్వతి,
7) తెనాలి – సత్యనారాయణ టాకీస్.
ఈచిత్రాన్ని మొత్తం ఆరు భాషలలో నిర్మించాారు.
మలైక్కల్లన్(1954) తమిళం,
అగ్గిరాముడు(1954) తెలుగు,
ఆజాద్(1955) హిందీ,
బెట్టెదకల్ల(1957) కన్నడ,
తస్కర వీరన్(1957) మళయాళం,
శూరసేన(1957) సింహళం భాషలలో రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ విజయం సాధించింది….