telugu navyamedia
సినిమా వార్తలు

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన “అదృష్ట జాతకుడు” నేటికీ 53 సంవత్సరాలు.

నటరత్న ఎన్. టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ “అదృష్ట జాతకుడు”
06-08-1971 విడుదలయ్యింది.

దర్శక-నిర్మాత కె.హేమాంబరధరరావు గారు సుభాషిణీ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ: బాలమురుగన్, మాటలు: మద్దిపట్ల సూరి, ఆదుర్తి నరసింహమూర్తి, పాటలు: కొసరాజు, సి.నారాయణరెడ్డి ,దాశరథి, సంగీతం: టి.వి.చలపతిరావు, ఫోటోగ్రఫీ: శేఖర్ సింగ్, కళ : బి.ఎన్.కృష్ణ, నృత్యం: కె.ఎస్.రెడ్డి, ఎడిటింగ్: బండి గోపాలరావు, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, రామకృష్ణ, సుమ, నాగభూషణం, పద్మనాభం, మిక్కిలినేని, ధూళిపాళ్ల, అల్లు రామలింగయ్య, బేబి శ్రీదేవి , మాస్టర్ ఆదినారాయణ, సాక్షి రంగారావు, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు టి.చలపతిరావు గారి సంగీత సారధ్యంలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“ఎవరనుకున్నావ్ నన్నేమనుకున్నావ్”
“ఏది నిజమైన పుట్టినరోజు ఏది అసలైన పండుగ రోజు”
“కల్ల కపటమెరుగని చల్లని చెల్లెమ్మ”
వంటి పాటలు శ్రోతలను అలరించాయి.

ఈ చిత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. మొదట రోజు 2లక్షల 10 వేల రూపాయలు వసూలు చేసి రికార్డ్ సృష్టించినది.

ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని మాత్రమే అందుకుని 50 రోజులు ప్రదర్శింపబడింది.

Related posts