సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన సినిమా’సర్కారు వారి పాట’ . పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన సినిమా మే 12న సినిమా విడుదలకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పొస్టర్స్ వీపరితీంగా ఆకట్టుకున్నాయి.
అంతేకాదు ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ ‘కళావతి సాంగ్’ ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లోనూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్ అత్యధిక వ్యూస్‌తో దుమ్ములేపుతోంది. ఎక్కడ చూసిన ఈ పాటే వినపడుతుంది.
దీంతో కీర్తి సురేష్, మహేశ్ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్‌పై స్టెప్పులేసి అలరించారు. నెటిజన్లే చాలా మంది ఈ సాంగ్‌కు రీల్స్ చేస్తూ సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు తమన్పైనా మహేశ్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కళావతి పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను శేఖర్ మాస్టర్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఆశ్చర్యపరిచారు. తమన్. దీనికి సంబంధించిన వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది. తమన్ డ్యాన్స్ స్టెప్పులపై విపరీతంగా లైక్స్, కామెంట్స్ చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.