telugu navyamedia
సినిమా వార్తలు

నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు మా..

మెగాస్టార్‌ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ పుట్టినరోజు ఈ రోజు (ఫిబ్రవరి 18). ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త‌ల్లి సురేఖ‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తండ్రి చిరంజీవి, తల్లి సురేఖతో కలిసి ఉన్న ఫొటోను సోషల్ మీడియా వేదిక‌గా తన అభిమానులతో పంచుకున్నారు. “నీకు తెలిసినంతగా నా గురించి ఎవరికీ తెలియదు… హ్యాపీ బర్త్ డే మా అంటూ కొంత ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఈ ఫోటో ఆచార్య షూటింగ్ సమయంలో దిగినట్లు తెలుస్తోంది. 

మెగ‌స్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాను సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా.. రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే సందడి చేయబోతోంది. ఈమూవీ ఏప్రిల్ 29న విడుద‌ల కాబోతోంది.

Related posts