ప్రముఖ సినీనటుడు సత్యరాజ్ (కట్టప్ప) కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు.
ఒక్కసారిగా ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. అందరు అంటున్నట్లే ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది.
వైద్య బృందం ఆయన త్వరగా కోలుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఇన్ ఫెక్షన్ తీవ్రంగా ఉండటం తో కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే..త్వరలోనే ఆయన కోలుకోంటారని, తమవంతు ప్రయత్నం తాము చేస్తున్నామని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది. త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

