ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. మరో కీలక పాత్ర రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ చేయనున్నాడు. అయితే ఇటీవల సైఫ్ అలీ ఖాన్ చేసిని వ్యాఖ్యలు ఈ సినిమాకు తలనోప్పి తెచ్చాయి. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్వకత్వంలో రూపొందనుంది. ఈ సినిమా భారత ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించనున్నారు. అయితే సైఫ్ ఇటీవల ఈ సినిమాలో కొత్త రావణుడు కనిపిస్తాడని అన్నాడు. ప్రేక్షకులు కొత్త రామాయాణాన్ని చూస్తారని చెప్పాడు. అంతేకాకుండా ఈ సినిమాలో సీతా అపహరణను చెడుగా కాకుండా మంచి కోణంలో చూపిస్తే అర్థవంతంగా ఉంటుందని అన్నాడు. దాంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు అతడిని సినిమా నుంచి తొలగించమంటూ దర్శకుడు ఓం రౌత్‌ను డిమాండ్ చేస్తున్నాడు. దీంతో కొత్త రామాయణానికి రావణుడు తలనొప్పి తెచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. దాంతో అందులో సైఫ్ అన్నా మాటలకు సరైన విశ్లేషణను ఇచ్చాడు. తన ఉద్దేశ్యం రావణుడు సీతను కేవలం తన చెల్లికి జరిగిన దానికి ప్రతీకారంగా తీసుకొచ్చిన కోణంలో మాట్లాడానని, తన మాటల్లో ఎటువంటి తప్పు ఉన్న క్షమించమని కోరాడు. అంతేకాకుండా తను పాల్గొన్న ఇంటర్వ్యూలోని తన మాటలు కొందరి భావాలను బాధించినట్లు తనకు అర్థం అయిందని కానీ తన ఉద్దేశ్యం అది కాదంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రాముడు నా దృష్టిలో ఒక గొప్ప హీరో, ధర్మం తప్పని వాడు, రామాయణాన్ని చెడుపై మంచి గెలిచిన తీరుగా తాను పరిగణిస్తానని, ఆదిపురుష్ టీమ్ ఈ గొప్ప కావ్యాన్ని చిత్రించేందుకు ఎనలేని శ్రమ చేస్తుందని, దానికి తాను చేసే పొరపాట్లు అడ్డంకులు కాకూడదని అన్నాడు.
previous post