telugu navyamedia
తెలంగాణ వార్తలు

రామకృష్ణ కుటుంబం సుసైడ్ కేసులో తల్లి, సోదరి అరెస్టు..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న రామకృష్ణ తల్లి సూర్యావతి, అక్క లీలా మాధవిలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితులకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. అక్కడి నుంచి ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

ఈ కేసులు ప్రధాన నిందితుడు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవేందర్​ రావును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవను పాల్వంచ పోలీసులు కొత్తగూడెంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచగా న్యాయమూర్తి రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

వనమా రాఘవకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

అనంతరం జైల్లో రాఘవకు రిమాండ్‌ ఖైదీ నెం.985 సంఖ్యను కేటాయించారు. ప్రత్యేక సబ్‌జైల్లోని బ్యారక్‌ నెం.1లో అతడిని ఉంచారు.

కాగా.. ఈ నెల 3వ తేదీన రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగ రామకృష్ణ ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్ఫీ వీడియోలో త‌న భార్య శ్రీలక్ష్మిని తన వద్దకు పంపాలని వ‌న‌మా రాగ‌వ అడిగాడ‌ని ..అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ, ఆర్థిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారు. నేను ఒక్కడినే వెళ్లిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్తున్నా అని వీడియోలో వెల్లడించాడు.

Telangana suicide victim's selfie video emerges, TRS MLA's son named again  | The News Minute

మరో వైపు ఆ వీడియోలొ వనమా రాఘవేందర్ రావుతో తన తల్లి సూర్యవతి, సోదరి లీలా మాధవి, పేర్లను కూడా రామకృష్ణ రాశాడు. రామకృష్ణ సూసైడ్ నోట్‌, సెల్ఫీ వీడియో ఆధారంగా తల్లి, సోదరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు

Related posts