రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘లైగర్. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులుకు డబుల్ సర్ప్రైజ్ ఇచ్చారు చిత్రబృందం.. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజాగా ‘లైగర్’మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 31 చిత్రానికి సంబంధించిన ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపింది.
మొట్ట మొదటిసారిగా ఇండియన్ సినిమాలో ప్రపంచ దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో సినిమాపై మరింత అంచనాలను తీసుకొచ్చారు.
పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ‘లైగర్’ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఛార్మి ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.