ఊహలు గుసగుసలాడేస సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయమైన ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ కుర్రకారు మదిలో గూడు కట్టుకుంది. యంగ్ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్గా తన కంటూ ప్రత్యేక మైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ.
ప్రస్తుతం ఆమె మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో నటిస్తోంది. సినిమాలో ఏంజెల్ ఆర్ణా పాత్రలో రాశీ చేసిన సందడి చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి.
కాగా నేడు (నవంబర్30)న రాశీ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరో స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ వీడియోలో నిజంగానే భువి నుంచి దిగివచ్చిన ఏంజెల్(దేవకన్యలా) దర్శనమిచ్చిందీ అందాల తార. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్ల సంయుక్త భాగస్వామ్యంతో బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రేప్ లకు సినిమాలు, సీరియల్స్ కూడా కారణం… బిగ్ బాస్ కౌశల్ మండా సంచలన వ్యాఖ్యలు