పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, రానా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లానాయక్’. దసరా పండగను పురస్కరించుకుని ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో పవన్‌కు జోడీగా నిత్యామేనన్‌ను నటిస్తుంది. వీరిద్దరికి సంబంధించిన ‘అంత ఇష్టం ఏందయ్యా నీకు.’ అనే టైటిల్ తో కూడిన పూర్తి మెలోడీగా సాంగ్ ను దసరా కానుకగా పవన్ ఫ్యాన్ కోసం విడుదల చేశారు. ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాసిన ఈ పాటను సింగర్ చిత్ర ఆలపించారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీసు ఆఫీసర్‌గా టైటిల్ రోల్ పోషిస్తుండగా.. డేనియల్ శేఖర్‌గా రానా ఓ శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చనున్నారు.
దిశ ఘటనపై పవన్ వ్యాఖ్యలు వక్రీకరణ… కుహనా మేధావులు అంటూ నాగబాబు సమాధానం