telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

దిశ ఘటనపై పవన్ వ్యాఖ్యలు వక్రీకరణ… కుహనా మేధావులు అంటూ నాగబాబు సమాధానం

Nagababu

హైదరాబాద్‌లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్‌ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్‌ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. కాగా… సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్‌పల్లికి వ్యాన్‌లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ‘రేపిస్టులకు ఉరిశిక్ష వద్దు బెత్తం దెబ్బలు చాలు’ అని పవన్ కళ్యాణ్ అన్నట్టు ఒక దినపత్రికలో ప్రచురితమైంది. ఈ వార్తను ఆధారంగా చేసుకుని కొంతమంది వైసీపీ నేతలు, పవన్ కళ్యాణ్‌ను ద్వేషించేవారు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేశారు. అలాంటి వారిపై ఇప్పుడు పవన్ సోదరుడు, జనసేన నేత నాగబాబు విరుచుకుపడ్డారు. కాస్త ఘాటుగానే స్పందించారు.

“కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే పత్రికలు, కొంత మంది రాజకీయ నాయకులు, పూర్తిగా అర్థంకానటువంటి కొంత మంది కోనా మేధావులు గత రెండు రోజులుగా కళ్యాణ్ బాబు విషయంలో తప్పుగా, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అదే.. దిశ రేప్ కేసు మీద. ఈ పేరును పదేపదే చెప్పి వాళ్ల తల్లిదండ్రులకు మనస్తాపం కలిగించడం ఇష్టంలేక మా ప్రతిస్పందన తెలియజేయడానికి మాత్రమే టచ్ చేస్తున్నాను. కళ్యాణ్ బాబు ఏమన్నాడు.. మీరు ఏం చెప్తున్నారు.. అనే విషయంలో నేను క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే అర్థంకాక, పూర్తిగా తెలియక మాట్లాడేవాళ్లు చాలా మంది అయితే.. ఒక వీడియో క్లిప్‌ని ఎడిట్ చేసి వాళ్లకు కావాల్సిన రీతిలో పెట్టుకున్నవాళ్లు ఒకరు. దిశ రేప్ కేసులో నిందితుల గురించి కళ్యాణ్ బాబు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అని మీరు తెలుసుకుంటే ఇలా నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడరు. ఒక ఆడపిల్లను అత్యంత ఘోరంగా రేప్ చేసి కిరోసిన్ పోసి తగలబెట్టి హేయమైన, క్రూరమైన చర్య చేసినవాళ్లను కళ్యాణ్ బాబు నాలుగు బెత్తం దెబ్బలు కొట్టి వదిలేయమంటాడా? మీకసలు బ్రెయిన్ ఉందా? కళ్యాణ్ బాబుపై ఇలా కామెంట్ చేస్తోన్న ప్రతివాడికి చెప్తున్నా.. మీకసలు బ్రెయిన్ ఉందా? మీకు ఒక్కరికేనా సమాజిక బాధ్యత.. మాకు లేదా? మాకు తెలీదా ఏం మాట్లాడాలో?… ఒక ఆడపిల్లని రేప్ చేసే పరిస్థితి వరకు తీసుకురావడం, చంపేయడం, అలా చేసినవాళ్లను ఉరిశిక్ష వరకు తీసుకువెళ్లడం.. అసలు ఇంతదూరం వెళ్లడం ఎందుకు. ఒక ఆడపిల్ల ఉదయం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చే లోపల ఆమెకు చిన్నపాటి అసౌకర్యం కలిగించినా, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటి తప్పులు చేసినా సరే సింగపూర్ తరహాలో బెత్తం దెబ్బలు (కేనింగ్) కరెక్ట్‌గా కొడితే.. ఆడపిల్ల వైపు చూడటానికి కానీ, ఆడపిల్లను ఏమైనా అనడానికి కానీ ధైర్యం చేయకుండా ప్రతివాడు జాగ్రత్త పడతాడు. అక్కడే కదా కేర్ తీసుకోవాలి.. చంపేయమని అందరూ చెబుతారు.. ఈ ప్రభుత్వాలు ఉన్నది దేనికి? ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి కదా అని కళ్యాణ్ బాబు చెప్పాడు. పవన్ ఏమన్నాడో కరెక్ట్‌గా వినండి. విని మాట్లాడండి. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అనే బాపతు ఆలోచనలు పక్కనపెట్టండి. మీకేనా నోటికి వచ్చినంత మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది. మాకు చేతకాదా? మేం మాట్లాడలేమా? వైసీపీ లీడర్స్ ఎన్నోన్నో చెబుతున్నారు.. మాకు చేతకాదా? మాకు సంస్కారం ఉంది కాబట్టి అనిగి ఉన్నాం. మీకు లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది మీ వివేకానికే వదిలేస్తున్నాం” అంటూ ఫైర్ అయ్యారు నాగబాబు.

Related posts