‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాల్లోచోటు సంపాదించుకుంది అందాల తార రాశీ ఖన్నా. తొలి చిత్రంతోనే తనదైన అందం, క్యూట్ నటనతో మెస్మరైజ్ చేసిన ఈ చిన్నది వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. ఇక అటు నుంచి వెనుతిరిగి చూడని ఈ ముద్దుగుమ్మ వరుస బడా ఆఫర్లు కొట్టేస్తూ టాలీవుడ్ అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది.
ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగులో బిజీ బిజీగా నటిస్తూ దూసుకుపోతోంది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తోంది. ఇదిలా ఉండగా రాశి ఖన్నా కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కనిపిస్తోంది ఈ నేపథ్యంలోనే రాశీ ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై స్పందించింది.. తాను వివాహం చేసుకునే వాడు అందగాడు కాకపోయినప్పటికీ.. ఆధ్యాత్మిక చింతన కలిగిన వాడై ఉండాలని చెప్పుకొచ్చింది. తన లాగే దేవుడిపై నమ్మకంతో పాటు భక్తిభావం ఉన్న వ్యక్తి నాకు భర్త రావాలని కోరుకుంటున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.. అలాగే ప్రస్తుత కాలంలో అలాంటి వాడు దొరకడం కష్టమే అయినప్ప్పటికి వేతికి పట్టుకుని మరీ పెళ్లి చేసుకుంటానంటంది ఈ అందాల రాశీ.
ప్రస్తుతం రాశి ఖన్నా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పెళ్లిపై స్పందించింది.
విజయశాంతి కోసం కమల్ హాసన్ లా తిరిగాను… అయినా… : అనిల్ రావిపూడి