telugu navyamedia
సినిమా వార్తలు

అంబానీ ఇంట్లో పని చేస్తున్న స్టార్ హీరో భార్య

Ambani

భారతదేశంలో అత్యధిక ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి అందరికి తెలిసిన విషయమే. ఆయన ఇళ్లల్లో “అంటిళ్ల” అని పిలవబడే ఆ ఇల్లు వరల్డ్ లోనే అత్యధిక ఖరీదైన ఇళ్లల్లో రెండవది. అయితే ఈ హోమ్ లో ఇప్పుడు రీ డిజైనింగ్ పనులు జరుగుతున్నాయి. అందుకోసం నీతా అంబానీ స్పెషల్ గా షారుక్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ ని పిలిపించారు. గౌరీ ఇంటీరియర్ డిజైనర్ అని కొందరికి మాత్రమే తెలుసు. చాలా మంది సెలబ్రేటిస్ హోమ్స్ కి ఆమె సలహాలు సూచనలు ఇస్తుంటారు. ఇక అంబానీ ఫ్యామిలీతో షారుక్ ఫ్యామిలీకి గత కొన్నేళ్ల నుంచి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇక ఇప్పుడు అంబానీ “అంటిళ్ల”లో కొన్ని ఫ్లోర్స్ కి గౌరీ ఖాన్ డిజైన్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గౌరీ ఖాన్ కి ముంబైలో ఇంటీరియర్ వర్క్స్ కి సంబందించిన హై ఫై స్టోర్ కూడా ఉంది.

Related posts