ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ యువ లాయర్  ఆత్మహత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న అనిల్ కుమార్  ఈరోజు కోర్టు ఆవరణలో పురుగుల మందు తాగాడు. ‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని నుదుటిపై రాసుకున్నారు. పురుగుల మందు సేవిస్తూ సెల్ఫీ వీడియో తీసుకొంటుండగా.. గమనించిన స్థానికులు, తోటి లాయర్లు ఆయన్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ ఆరోగ్యం విషమంగానే ఉందని  ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
							previous post
						
						
					

