ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి మా నాన్న జాబ్ తిరిగి ఇప్పించండని పేర్కొంటూప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రధానికి లేఖ రాయడం ఇది 37వ సారి. 2016 నుంచి విద్యార్థి ప్రధానికి లేఖలు రాస్తున్నాడు. గడిచిన 36 లేఖలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదు. ఉత్తరప్రదేశ్ స్టాక్ ఎక్సైంజ్(యూపీఎస్‌ఈ)లో బాలుడి తండ్రి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని బాలుడు లేఖలో పేర్కొంటూ తిరిగి జాబ్ ఇప్పించాల్సిందిగా ప్రధానిని కోరాడు.
ఉద్యోగం కోల్పోవడం వల్ల తమ కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీరు ఇచ్చిన నినాదాన్ని విన్నాను. ప్రజలకు తెలుసు మోదీ ఉంటే ప్రతిది సాధ్యమేనని. అందుకే మా విన్నపాన్ని ఒక్కసారి ఆలకించాల్సిందిగా కోరుతున్నట్లు విద్యార్థి లేఖలో పేర్కొన్నారు. తన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రధాని మోదీకి లేఖ రాసాడు.
బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న