telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఇక పై వలస పక్షులకు టీడీపీలో అవకాశం లేదన్న చంద్రబాబు..

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో జమ్మలమడుగు నేతలు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‍రెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి సోదరుడు నారాయణరెడ్డి టీడీపీలోకి చంద్రబాబు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం పార్టీ లో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని అన్నారు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లారని, జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. అంతేకాదు భూపేష్ రెడ్డిని జమ్మలమడుగు టీడీపీ ఇన్ చార్జ్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా ఇక పై వలస పక్షులకు టీడీపీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఎన్నికల ముందు వాసన పసిగట్టి పార్టీ లో వచ్చే వారిని ఆహ్వానించేది లేదన్నారు. కష్టకాలంలో పార్టీకోసం పని చేసిన వారికే ఎన్నికల్లో ఇకపై గుర్తింపు ఉంటుందన్న బాబు స్పష్టం చేశారు. తాను గతం లో ఈ సిద్ధాంతంలో కఠినం గా ఉండలేక పోయానని చెప్పిన టీడీపీ అధినేత .. పార్టీలో ఎవరేంటో అన్ని రికార్డ్స్ లో రాసిపెడుతున్నామని చెప్పారు.

అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు తగినట్టుగా పార్టీ బలోపేతం కావాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మోజార్టీ ప్రజలు టీడీపీతోనే ఉన్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు చెప్పారు.

Related posts