జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది… నిర్మల్ జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు… గతంలో నిర్మల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన మహేశ్వర్ రెడ్డి… గత కొంతకాలంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.. ఇక, గురువారం ఉదయం కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన ఆయన.. బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో సంప్రదింపులు కూడా పూర్తి చేసుకున్నారని టాక్ నడుస్తోంది… రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ భూపేంద్ర యాదవ్‌తో భేటీ కానున్న మహేశ్వర్‌రెడ్డి… ఆయన సమక్షంలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా.. గ్రేటర్ ఎన్నికల సమయంలో.. వరుసగా కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పడం.. పెద్ద చర్చగా మారింది. కాగా, మహేశ్వర్ రెడ్డి 2009లో ప్రజా రాజ్యం పార్టీ (పీఆర్పీ) టికెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.. అయితే, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి విజయాన్ని అందుకోలేకపోయారు.
							previous post
						
						
					
							next post
						
						
					

