telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంట కొనుగోళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: ఉత్తమ్

uttam congress mp

లాక్ డౌన్ నేపథ్యంలో పంట కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి పంట సేకరణ కోసం రూ.30 వేల కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం చెబుతోందని, అదే నిజం అయితే ధాన్యం సేకరణ కేంద్రాల్లో గోనె సంచుల కొరత ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ విషయమై ఇతర పార్టీలతో కలిసి ఎలుగెత్తుతోందని ట్వీట్ చేశారు.

లాక్ డౌన్ సమయంలో పంట కొనుగోళ్ల అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రైతు నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసేలా హామీ ఇవ్వాలని అన్నారు. తద్వారా ఈ సంక్షోభ సమయంలో రైతును ఆదుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ లాక్ డౌన్ అమలు గురించి మాట్లాడుతూ రైతుల వద్దకే వచ్చి పంటలు కొనుగోలు చేస్తామని చెప్పిన విషయం విధితమే.

Related posts