telugu navyamedia
తెలంగాణ వార్తలు

70.. 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు.. రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్లు

జోనల్‌ విధానంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చాలా పోరాటం చేశాం.. జోనల్‌ విధానం అమలైతే ఎక్కడివారికి అక్కడ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ సమావేశాల్లో వివిధ అంశాలపై వివరణాత్మకంగా మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. కొత్త జోనల్ వ్యవస్థ ల్యాండ్ అవుతుంది.. ఏ జిల్లాకు ఎన్ని జాబ్స్.. అనేది తేల్చుతామన్న సీఎం కేసీఆర్… నెల, రెండు నెలల్లో కొత్త ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని వెల్లడించారు.

ఇక, దసరా తర్వాత… ఎక్కడి వాళ్లకు అక్కడే ఉద్యోగాలు ఉంటాయని.. 70 వేల.. 80 వేల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయంటూ తీపికబురు చెప్పారు. మెడికల్ డిపార్ట్‌మెంట్స్‌లో ప్రమోషన్లు ఇస్తాం అన్నారు సీఎం కేసీఆర్.. ప్రజలకు అప్పీల్ చేస్తున్నా.. బంగారు తెలంగాణ అంతే.. ప్రతి కుటుంబం ఆర్ధిక స్వావలంబనతో ఉండాలన్నారు.

పోడు భూముల సమస్య పరిష్కారం చేస్తామని మరోసారి హామీ ఇచ్చిన ఆయన.. అడవులు కూడా పరిరక్షణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.. గిరిజనులు అడవులు నరకరు.. పెంచుతారు.. కానీ, గిరిజనుల అడ్డుపెట్టుకుని… కొందరు దొంగలు ఉన్నారని సీఎం కేసీఆర్ మండి పడ్డారు.

Related posts