telugu navyamedia
తెలంగాణ వార్తలు

స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు : అసెంబ్లీ నుంచి ఈటల సస్పెండ్..

అసెంబ్లీ నుంచి ఈటల స‌స్పెన్ష‌న్‌
స్పీక‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసినందుకు సస్సెన్ష‌న్‌

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ సెషన్‌లో కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.8వ సెషన్ మూడవ మీటింగ్ ముగిసే వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సభ మొదటి రోజున బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించలేదు. ఈ విషయమై అసెంబ్లీ మీడియా పాయింట్ లో స్పీకర్‌ను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. స్పీకర్ మరమనిషిగా నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ఈ వ్యాఖ్యలను అధికార పార్టీ తప్పుబట్టింది.

ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని వ్యవహరాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈటల రాజేందర్ ను డిమాండ్ చేశారు. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడంతో ఈ సెషన్‌ మొత్తానికి ఈటను చేయాలని అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదించింది.

సభ నుంచి బయటకు వచ్చిన ఈటల.. తన వాహనంలో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం పోలీసుల వాహనంలో ఈటలను అక్కడనుంచి పంపించారు. పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్ట్‌ చేస్తున్నారా అంటూ పోలీసులను ప్రశ్నించారు

బానిసలా వ్యవహరించవద్దు అంటూ పోలీసులపై ఆగ్రహించారు. ‘‘మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారు. సంవత్సర కాలంగా కుట్ర చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కుతున్నారు. గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడను’’ అని ఈటల రాజేందర్ అన్నారు.

Related posts