telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నోటిఫికేషన్ ఫీజు నామా మాత్రంగా ఉండాలి : కోదండరాం

Kodandaram

సీఎం కేసీఆర్ తాజాగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది అని అన్నారు. 2013 – 14 లో రాష్ట్రంలో 2.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు ఉంటే ఇప్పుడు 8 శాతం కి పెరిగింది. జె ఎల్ రీక్యూటిమెంట్ గాని యూనివర్సిటీ లలో భర్తీలు లు లేవు. ప్రభుత్వం లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు ఉంటాయి దానికి కమిటీలు అవసరం లేదు. జోనల్ వ్యవస్థ ను సవరించాల్సిన అవసరం ఏర్పడింది. పాత జోన్ ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బందులు వస్తాయి. జోన్ ల ప్రకారం ఉద్యోగాల పంపిణీ పూర్తి కాలేదు. 3 ఏళ్లుగా టెట్ లేదు టీచర్ పోస్టులు ఎలా భర్తీ చేస్తారు. హడావిడిగా ఎన్నికలు వస్తున్నాయని నోటిఫికేషన్లు అంటున్నారు. అందుకే ఉద్యోగాల భర్తీ పై నమ్మకం లేదు అని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ చేయడానికి ప్రభుత్వం కి చిత్తశుద్ధి లేదు.

అయితే మార్చి లోపల పరీక్షలు జరిపే ప్రయత్నం చేయాలి. ప్రస్తుతం లాటరీ ప్రాతిపదికన టీచర్లకు జీతాలు ఇస్తున్నారు. యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. టీచర్లకు ఇంత వరకు ప్రమోషన్లు ఇవ్వడం లేదు 3 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. 2018 నుండి పీఆర్సీ పెండింగ్ లో ఉంది. 50 మందికి పైగా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగాల కోసం అకడమిక్ క్యాలెండర్ ప్రకటించాలి. ఆంధ్ర కాంట్రాక్టు ల జేబులు నింపే పైన ఉన్న శ్రద్ధ నిరుద్యోగ సమస్య పరిష్కారం పై చూపెట్టడం లేదు అని తెలిపిన ఆయన నోటిఫికేషన్ ఫీజు నామా మాత్రంగా ఉండాలి అన్నారు. నోటిఫికేషన్ ల కోసం ఇంత కాలంగా ఎదురు చూశారు. అందుకే ఉద్యోగాల కోసం వయోపరిమితి పెంచాలి అని అన్నారు. మరి దీని పై తెరాస నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.

Related posts