telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక బైపోల్ : 3 గంటలవరకు 71.10 శాతం పోలింగ్…

ప్రస్తుతం తెలంగాణాలో దుబ్బాక ఎలక్షన్ హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే మ‌ధ్యాహ్నం 3 గంటల వరకు దుబ్బాక లో 71.10 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు ఎన్నిక‌ల అధికారులు ప్రకటించారు.. మరోవైపు.. ఉదయమే అందరూ అభ్యర్థులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.. వివిధ పోలీంగ్‌ స్టేషన్లో ఓటింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అయితే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాబట్టి భారీగా పోలింగ్ శాతం నమోదయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఉదయం నుండే భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు ఓటర్లు. మరోవైపు.. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా ల‌చ్చ‌పేట‌లో రాష్ర్ట ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి శ‌శాంక్ గోయ‌ల్ ప‌ర్య‌టించారు. అక్క‌డ పోలింగ్ కేంద్రాల‌ను ప‌రిశీలించారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు చేశామ‌ని తెలిపారు. ఇక, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 23 మంది అభ్య‌ర్థులు ఉండగా.. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. చూడాలి మరి ఎవరు విజయం సాధిస్తారు అనేది.

Related posts