telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఆసీస్ : మొదటి సెషన్ పూర్తి

బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా భారత్-ఆసీస్ మధ్య నేడు నాల్గవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టును భారత యువ పేసర్లు వణికిస్తున్నారు. మ్యాచ్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను సిరాజ్ పెవిలియన్ కు చేర్చగా 9వ ఓవర్లో మరో ఓపెనర్ మార్కస్ హారిస్ ను శార్దుల్ ఠాకూర్ వెనక్కి పంపాడు. ఈ మ్యాచ్ లో టీం ఇండియాలో అనుభవం ఉన్న ఒక్క బౌలర్ కూడా లేడు. భారత బౌలర్లు అందరూ కలిసి ఇప్పటివరకు ఆడినవి 4 మ్యాచ్ లే కావడం గమనార్హం. అయితే అనుభవం లేని బౌలింగ్ విభాగం తో ఆడుతున్న భారత జట్టు మొదటి సెషన్ పూర్తయే సమయానికి 65/2 కి ఆసీస్ ను కట్టడి చేసింది. అయితే అనుభవం లేని ఈ భారత బౌలర్లు పరుగులను కట్టడి చేస్తున్నారు… కానీ వికెట్లు సాధించలేకపోతున్నారు. ఇక ప్రస్తుతం ఆసీస్ ఆటగాళ్లు లాబుస్చాగ్నే(19), స్టీవ్ స్మిత్(30) తో బ్యాటింగ్ కొనసాగిస్తూ ఇప్పటికే 48 పరుగుల భాగసౌమ్యం నెలకొల్పారు. చూడాలి మరి ఈ భాగసౌమ్యని ఏ బౌలర్ విడదీస్తాడు అనేది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు విజయం స్దితే సిరీస్ వారిదే అనే విషయం అందరికి తెలిసిందే.

Related posts