సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలను ఫాలో అవుతుంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన సెలెబ్రిటీల జాబితా బయటకు వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లు అత్యధికంగా ఫాలో అవుతున్న భారతీయ వ్యక్తి క్రికెటర్ విరాట్ కోహ్లీ. 82.2 మిలియన్ల మంది ఫాలోవర్లతో కోహ్లీ మొదటి స్థానంలో నిలిచారు. ఇక విరాట్ తరువాత 58.1 మిలియన్ల అభిమానులతో ప్రియాంక చోప్రా జోనాస్ రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు దీపికా పదుకొనె 52.3 మిలియన్లతో మూడో స్థానంలో ఉంటే తాజాగా శ్రద్ధా కపూర్ ఆమెను దాటుకొని 56.4 మిలియన్లతో మూడో స్థానంలో నిలిచింది. వీరితో పాటు 50.1 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో అలియా భట్, 48.2 మిలియన్లతో నేహా కక్కర్, అక్షయ్ కుమార్ 46.8, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 46.2, కత్రినా కైఫ్ 44.8 మిలియన్ల అభిమానులను కలిగి ఉన్నారు. బాలీవుడ్ నటులు, ప్రముఖులే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రపంచ వ్యాప్తంగా 49.7 మిలియన్ల మంది ఫాలో అవుతుండడం విశేషం.
previous post