telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు.

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో వ‌రుస మ‌ర‌ణాల‌పై అసెంబ్లీ ఒక్క‌సారిగా దద్దరిల్లింది . సోమవారం నాడు సమావేశాలు ప్రారంభమైనప్పట్నుంచీ టీడీపీ సభ్యులు ఆందోళన చేపడుతున్నారు. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎక్కి నినదాలు చేస్తూ కాగితాలు చింపి స్పీకర్ పై విసిరేశారు.

టీడీపీ సభ్యులు తమ సీట్లలోకి వెళ్లకపోవడంతో సభ వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభమైన వెంటనే.. టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

స్పీకర్ పోడియం చుట్టూ చేరి ఆందోళన చేయడంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు.

స‌భ నుంచి మొత్తం ఐదుగురు టీడీపీ సభ్యులపై వేటు వేశారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావు కేశవ్, నిమ్మల రామానాయుడు, బాలవీరాంజనేయులును ఈ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు.

 

 

 

 

Related posts