తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు కైవసం చేసుకున్న కమలనాథులు లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతున్నారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉండగా..ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఐదు స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 11గంటల వరకు అందిన సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి 15వేల ఓట్ల ఆధిక్యంలో, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ 18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థులు ముందజంలో ఉన్నారు. అధికార టీఆర్ఎస్ 10 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నల్గొండ నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు.
ప్రజలు తిరస్కరించినా లోకేశ్ కు బుద్ధి రాలేదు: వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు