telugu navyamedia
ఆంధ్ర వార్తలు

స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి: వీహెచ్‌

vh hanumantharao
  • నన్ను పార్టీలో నుంచి బయటకు పంపపాలని కుట్ర చేస్తున్నారు
  • అధికార పక్షంతో పోరాడటం పక్కన ఉంచితే స్వపక్షంలో విపక్షాలు తయారవుతున్నాయి.
  • తనను అవమానపరిచిన మంచిర్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పట్టుబట్టాడు.
  • పైకి పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని చెప్పిన అప్పుడప్పుడు ఈ విబేధాలు ఒక్కసారిగా గుప్పుమంటున్నాయి.
  • మంచిర్యాలలో మాకు అవమానం జరిగితే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదంటూ మండిపడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇటీవల తనకు అవమానం జరిగిందని.. ప్రస్తుతం ఈ షోకాజ్ నోటిసే కాంగ్రెస్ పార్టీలో రచ్చకు కారణం అవుతోంది. ప్రేమ్ సాగర్ రావుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఏమీ లేదంటూ.. వీహెచ్ విమర్శిస్తున్నారు.

Related posts