telugu navyamedia
క్రీడలు వార్తలు

మొదటి మ్యాచ్ తోనే మరో రికార్డు సాధించిన గేల్…

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2020 జనవరి తర్వాత తొలిసారిగా ప్రొఫెషనల్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన క్రిస్ గేల్ 45 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 భారీ సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. 41 ఏళ్ల గేల్ కేఎల్ రాహుల్‌తో కలిసి 2వ వికెట్‌కు 93 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి మ్యాచ్ చివరి ఓవర్‌లో రనౌట్ అవుటయ్యాడు. సాధారణంగా ఓపెనర్ అయిన గేల్ ఈమ్యాచ్ లో 3 వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు

అయితే ఐపీఎల్ 2020 లో ఆడిన ఈ మొదటి మ్యాచ్‌లోనే టీ20ల్లో అరుదైన రికార్డ్‌ను గేల్ సాధించాడు. ఈ పొట్టి ఫార్మాట్ లో 13,349 రన్స్‌ చేయడంతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే ఈ యూనివర్స్ బాస్ బౌండరీల ద్వారానే పది వేల పరుగుల్ని పూర్తి చేయడం విశేషం. టీ20ల్లో గేల్ 1027 ఫోర్లు, 982 సిక్సులు బాదాడు. ప్రస్తుతం గేల్ కాకుండా కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ టీ20ల్లో పది వేలకుపైగా పరుగులు చేశారు. ప్రస్తుతం ఫుడ్ పాయిజన్ నుంచి బయటపడ్డ క్రిస్‌గేల్ కనీసం 50 ఏళ్లు వచ్చేదాకా క్రికెట్ ఆడతానని తెలిపాడు.

Related posts