telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఐ.టి అధికారుల సోదాలు

Delhi high court

ఢిల్లీ హైకోర్టు న్యాయవాది కి చెందిన నివాసాలు, కార్యాలయాలలో ఆదాయ పన్ను ( ఐ.టి) అధికారుల సోదాలు జరిపారు. ఢిల్లీ, హర్యానా, దేశ రాజధాని పరిపాలన కేంద్రం ( ఎన్.సి.ఆర్) లోని మొత్తం సుమారు 38 ప్రాంతాలలో ఐ.టి సోదాలు చేశారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు లభించినట్లు ఐ.టి విభాగం అధికారిక ప్రకటన చేసింది. మధ్యవర్తిత్వం కేసులలో క్లయింట్ల నుంచి ఢిల్లీ హైకోర్ట్ న్యాయవాది రెండు కేసులలో మొత్తం 217 కోట్ల రూపాయలు నగదు రూపంలో తీసుకున్నట్లు సాక్ష్యాధారాలు లభ్యమైనట్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాలలో లెక్కలలో చూపని డబ్బుతో నివాసాలు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన ఆధారాలు లభ్యం అయ్యాయి.

గత రెండేళ్లుగా అనేక స్కూళ్లు, ట్రస్ట్ ల ఆధ్వర్యంలో నిర్వహించే పలు స్కూళ్లను, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ఇతర ఆస్తులను న్యాయవాది తో సహా, సహచరుల బృందం కొనుగోలు చేసినట్టు గుర్తించారు అధికారులు. రెండు మధ్యవర్తిత్వం కేసులలో వివాదాలను పరిష్కారం చేసినందుకు క్లయింట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకున్నాడు న్యాయవాది. ఒక కేసులో 100 కోట్ల పైగా నగదు తీసుకున్న న్యాయవాది, మరొక కేసులో లెక్కలలో 21 కోట్ల రూపాయలు చెక్‌ రూపంలో తీసుకున్నట్లు ఉన్నా, నగదు రూపంలో అదే కేసులో 117 కోట్లు తీసుకున్నట్లు ఐ.టి సోదాలలో వెల్లడించారు. అడ్వకేట్, ఆయన సహచరులకు చెందిన నివాసాలు, కార్యాలయాలలో సోదాలు చేసిన అధికారులు..బ్యాంకు లలోని 10 లాకర్లను స్తంభింప చేశారు.

Related posts