telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా వ్యాఖ్యలపై మండిపడ్డ .. నిర్మలాసీతారాం..

nirmalasitaram as 2nd women as finance minister

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పౌరసత్వ చట్టం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మమతపై కేంద్ర మంత్రులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మాట్లాడం సరికాదని హితవుపలికారు. పౌరసత్వ చట్టంపై మమత మాట్లాడుతూ.. ‘బీజేపీకి దమ్ముంటే సీఏఏ, ఎన్నార్సీపై ఐకరాజ్య సమితి పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సవాలు విసిరారు.

ఈ రెఫరండంలో బీజేపీ ఓటమి పాలైతే అధికారం నుంచి తప్పుకోవాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయిన తర్వాత.. ఇప్పుడు భారత పౌరులుగా నిరూపించుకోవాలా’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిర్మలా తీవ్రంగా తప్పుబట్టారు. భారత అంతర్గత విషాయాల్లో ఇతరుల (థర్డ్‌పార్టీ) జోక్యాన్ని తాము ఏమాత్రం స్వాగతించేం లేదని ఘాటు సమాధానమిచ్చారు. కనీస అర్థంలేని విధంగా మమత మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు ఇలా ఆందోళనలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Related posts