telugu navyamedia
క్రీడలు వార్తలు

నిన్నటి మ్యాచ్ లో గేల్ కు కోపం వచ్చిందంట…!

నిన్న ఐపీఎల్ 2020 లో మ్యాచ్ ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగింది. అయితే ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై లో క్వింటన్ డికాక్ (53) అర్ధశతకంతో రాణించడంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఇక 177 ల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ బాట్స్మెన్ లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (77) అర్ధశతకంతో అదరగొట్టాడు. కానీ చివరికి మ్యాచ్ టై అయ్యింది. ఆ తర్వాత సూపర్ ఓవర్లో పంజాబ్ 5 పరుగులు మాత్రమే చేసింది. కానీ ముంబై కూడా సూపర్ ఓవర్ లో కేవలం 5 పరుగులు మాత్రమే చేయడంతో రెండో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. 

అయితే ఈ రెండో సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 11 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ తరపున బ్యాటింగ్ చేయడానికి మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్ వచ్చారు. కానీ గ్రౌండ్ లోకి వస్తున్న సంమయంలో గేల్ కోపంగా కనిపించాడు. అయిన మొదటి బాల్ లోనే సిక్స్ బాదిన గేల్ తర్వాత ఒక రన్ తీసాడు. ఇక ఆ తర్వాత మయాంక్ రెండు ఫోర్లు కొట్టడంతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం గేల్ మాట్లాడుతూ… నేను రెండో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు వెళ్తున్నపుడు ఒత్తిడి లేదు. కానీ నాకు కోపం వచ్చింది.  సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లో తమ జట్టు ఆ పరిస్థితుల్లో చూసి కోపం వచ్చింది అన్నాడు. అలాగే మొదటి సూపర్ ఓవర్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. 5 పరుగుల లక్ష్యాన్ని కాపాడటం అంత సులభం కాదు… అందుకే ఈ మ్యాచ్ లో నా హీరో, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా షమీనే అని ఈ గేల్ అన్నాడు.

Related posts