telugu navyamedia
క్రీడలు వార్తలు

ప్రకటనలో కలిసి నటించిన ప్రేమపక్షులు…

టీమిండియా ఆటగాడు రాహుల్‌, అతియా కలిసి తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. వారిద్దరూ ఎంతో సరదాగా.. సన్నిహితంగా గడిపారు. ‘నుమి ప్యారిస్’ విలాసవంతమైన గాగుల్స్ యాడ్‌లో వీరిద్దరూ నటించారు. ఇదే అదనుగా అతియా తండ్రి, నటుడు సునీల్‌ శెట్టి తెరమీదకు వచ్చాడు. ‘నిజంగా అద్భుతం! అతియా, రాహుల్‌.. మీరిద్దరూ ఈ సరికొత్త అవతారంలో మతి పోగొట్టారు!!!’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. దాంతో అతని గారాల పట్టి అతియా సైతం తండ్రి వ్యాఖ్యకు వెంటనే స్పందించింది. ఇక ఈ ప్రకటనకు సంబంధించిన ఫొటోపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ క్వీన్ అనుష్క శర్మ బాటలోనే రాహుల్-అతియా నడుస్తున్నాడని, పెళ్లి చేసుకోవడమే ఆలసమ్యని కామెంట్ చేస్తున్నారు. అనుష్క శర్మ, కోహ్లీలు కూడా ఇలా ఓ అడ్వర్టైజ్‌మెంట్ షూటింగ్ కలుసుకొని.. ప్రేమించుకొని పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం రాహుల్‌ ఇంగ్లండ్‌లో పర్యటనలో ఉన్నాడు. ఐపీఎల్ ఆడుతుండగా అతను తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌గా తేల్చారు. దాంతో వెంటనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. త్వరగా కోలుకొని ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు.

Related posts