కరోనా కారణంగా రోజుకు 50 మంది లోపే దుర్గమ్మ ను దర్శించుకున్నారు భక్తులు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో మెల్లగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. భక్తుల రద్దీ ద్రుష్ట్యా నేటి నుంచి అన్నదానం పునరుద్ధరణ చేసారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో ప్యాకేట్స్ రూపంలో అన్నదానం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి ఆదాయం పూర్తిగా పడిపోయింది. గతంలో రోజుకి10 లక్షలు, శుక్రు,ఆదివారాల్లో 20 లక్షలు వచ్చేది. కరోనా దెబ్బకి ఇప్పుడు రోజుకి లక్ష కూడా ఆదాయం రాని పరిస్థితి ఏర్పడింది. భక్తులు సంఖ్య పెరుగుతుండడంతో ఇంద్రకీలాద్రి పై కోవిడ్ ఆంక్షలను మరింత కఠినతరం చేసారు. 60 ఏళ్లు పై బడిన వ్రుద్ధులకు , పదేళ్ల లోపు చిన్నారులకు కొండపైకి అనుమతి నిరాకరించారు. అమ్మవారి ఏకాంతపు సేవల్లో భక్తులను అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నారు దుర్గగుడి అధికారులు, పాలకమండలి సభ్యులు. చూడాలి మరి ఏం జరుగుతుంది.
previous post
next post