telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాశ్, శివాజీల పిటిషన్లు వాయిదా వేసిన హైకోర్టు

Ravi praksh shivaji

టీవీ9 లావాదేవీల ఫోర్జరీ కేసులో కేసులో అభియోగాలేదేర్కొంటున్న ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. అలాగే సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని నటుడు శివాజీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను కూడా జూలై 21కి వాయిదా వేసింది. ఇటీవల అమెరికాకు పారిపోతున్న నటుడు శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీచేశారు. టీవీ9 బోర్డులో డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడ్డ రవిప్రకాశ్, ఇందుకోసం ఫోర్జరీ పత్రాలను సృష్టించినట్లు అలంద మీడియా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. .

Related posts