telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టీడీపీలో విషాదం : క‌రోనాతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బలి

TDP-flag

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది.  తాజాగా కరోనా తో మాజీ ఎమ్మెల్సీ బొద్దు భాస్కర్ రావు (72) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందారు. 1984 లో జెడ్పీ ఛైర్మన్ గా టిడిపి తరఫున రారావ్ సేవలందించారు. అలాగే 1994, 2004 లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. 2012-17 వరకు ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు పనిచేశారు. బొడ్డు భాస్కర రామారావు స్వగ్రామం పెదపూడి మండలం పెద్దాడ. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts