telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబు, ప‌వ‌న్ తోడుదొంగ‌లు..వాళ్ళిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉండ‌డానికి ఆర్హులేనా..?

*చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు..
*చంద్ర‌బాబు, ప‌వ‌న్ తోడుదొంగ‌లు..
*వాళ్ళిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉండ‌డానికి ఆర్హులేనా..?

శ్రీసత్యసాయి జిల్లాలో 2021 ఖరీఫ్‌కు సంబంధించి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని వారిని ఒక్కరిని కూడా చూపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను సవాలు చేసినా వారిద్దరూ స్పందించలేదని చెప్పారు. అంత పారదర్శకంగా తాము రైతుల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో పట్టాదార్ పాస్ బుక్ ఉన్న రైతు ఒక్కరైనా ఉన్నారా? అని పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరారు. కౌలు రైతులకు రైతు భరోసా కేంద్రంలో సీసీఆర్డీఏ కార్డు ఉందని, ఏడు లక్షల రూపాయల పరిహారం దొరుకుతుందని, వారిలో ఒక్కరినైనా చూపించగలరా జగన్అని ఛాలెంజ్ విసిరారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 438 కుటుంబాలను తమ ప్రభుత్వమే ఆదుకుందన్నారు. చంద్రబాబు హయాంలో రైతు ఆత్మహత్యలు జరిగితే ఆయన దత్తపుత్రుడికి గుర్తు రాలేదన్నారు.

చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడు. ఈనాడు, చంద్రబాబు, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారు.

చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో లెక్కలు వేసుకొని పరిగెత్తే వ్యక్తి దత్తపుత్రుడు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలేన‌ని అన్నారు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అంటూ సీఎం జగన్‌ ప్రశ్నించారు.

ప్రభుత్వ మంచితనాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు సహా చంద్రబాబు, దత్తపుత్రుడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పారేసి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

టెన్త్‌లో 67 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. గుజరాత్‌లో 65 శాతమే పాస్‌ అయ్యారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాలి. టెన్త్‌ విద్యార్థులను సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. సప్లిమెంటరీలో పాస్‌ అయిన రెగ్యులర్‌గానే పరిగణిస్తామని సీఎం జగన్‌ అన్నారు.

Related posts