వైసీపీ నాయకుల కంటే టీడీపీ నేతలే చంద్రబాబును ఎక్కువ తిడతారని వైసీపీ నేత దేవినేని అవినాష్ అన్నారు. ఉదయం చంద్రబాబుని దేవుడని పొగుడుతారని, రాత్రి అయ్యేసరికి తిడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, వల్లభనేని వంశి, దేవినేని అవినాష్ ల మీద శపధాలు చేసి, తొడలు కొట్టాలని చెప్పిందే చంద్రబాబేనని ఆరోపించారు.
స్టేజ్ మీద తొడలు కొట్టి, శపధాలు చేసిన వాళ్ల జాతకాలు ఏంటో తనకు తెలుసని.. మీ చీకటి బతుకులు తనకు తెలుసంటూ దేవినేని అవినాష్ విమర్శించారు.
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల దగ్గర లక్షలు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతల మాట్లాడిన మాటలన్నీ తమ వద్ద రికార్డులో ఉన్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కాబట్టి ఏమీ చేయలేక కవ్వింపు చర్యలకు దిగుతున్నారని దేవినేని అవినాష్ విమర్శించారు.
వైఎస్జ గన్మోహన్ రెడ్డి ని గాని, వారి కుటుంబాన్నికాని విమర్శిస్తే గతంలో ఎలా స్పందించామో అలాగే ఇప్పుడు కూడా రియాక్ట్ అవుతామని చెప్పారు.
విజయవాడలో టీడీపీ భూస్ధాపితం అయిపోయిందని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తన గురించి మాట్లాడటం మాని.. సొంత పార్టీ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన బుద్దావెంకన్నకు జరిగిన అవమానం గురించి మాట్లాడాలంటూ సూచించారు.
తన తండ్రి చేతిలో గద్దె రామ్మోహన్ ఓడిపోయిన విషయాన్ని దేవినేని అవినాష్ గుర్తు చేశారు. చెన్నుపాటి గాంధీ వద్ద వైసీపీ కార్యకర్తల గొడవ పడితే దానికి రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్ లో ప్రధాన నిందితుడు గద్దె రామ్మోహన్ అని దేవినేని అవినాష్ ఆరోపించారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పతనం ఖాయం: బీజేపీ ఎంపీ సంజయ్