telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం: గవర్నర్ తమిళిసై

governor tamilisai

కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియాతో ఆమె మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

కరోనాను కట్టడికి ఎక్కువ టెస్టులు చేయడమే ముఖ్యమని అన్నారు. మొబైల్ టెస్టింగులు చేయాలని ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. కరోనా కట్టడిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఐదారు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు.

ఐసీఎంఆర్ నిబంధనల మేరకు టెస్టులు చేస్తున్నామంటూ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం సరైన సదుపాయాలు లేవని, అందుకే కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని చెప్పారు.

Related posts